ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిరా మిరా మీసం అంటూ.. కాటమరాయుడు టైటిల్ సాంగ్ వచ్చేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 06:09 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజైంది. ఈ సినిమా ఆడియోను అభిమానులకి అందిస్తున్న ఆదిత్యా మ్యూజిక్ ముందుగా ప్రకటించినట్టుగానే ఇవాళ సాయంత్రం మిరా మిరా మీసం సాంగ్ రిలీజ్ చేసింది. గోపాల గోపాల ఫేమ్ కిషోర్ కుమార్ పార్థసాని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పవన్ సన్నిహిత మిత్రుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. గోపాల గోపాల చిత్రానికి మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్సే మళ్లీ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. 











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa