ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు

international |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2023, 03:18 PM

భారత సంతతికి చెందిన రవి చౌదరిని ఎయిర్‌ ఫోర్స్‌కు అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ డిఫెన్స్‌గా నియమించాలన్న ప్రతిపాదనకు అమెరికా పెద్దల సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవి ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనకు సెనెట్ 65-29 ఓట్ల తేడాతో మద్దతు పలికింది. రవికి అనుకూలంగా ఓటేసిన వారిలో డజను మందికి పైగా ప్రతిపక్ష రిపబ్లికన్ సభ్యులు ఉండటం గమనార్హం. 


రవి చౌదరి 1993-2015 మధ్య అమెరికా ఎయిర్‌ఫోర్స్‌‌లో సీ-17 విమాన పైలట్‌గా వివిధ రకాల మిషన్లలో పాల్గొన్నారు. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో వున్న జీపీఎస్ ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరించారు. ఆ తరువాత అమెరికా రవాణా శాఖలో సీనియర్ అధికారిగా పనిచేశారు. అమెరికా విమానయాన శాఖ ఫెడరల్ ఏవియేషన్‌లోనూ సేవలందించారు. ఆ శాఖకు సంబంధించి అధునాతన పరిశోధన కార్యక్రమాలకు సంబంధించిన విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com