ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం, పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 10:58 AM

 వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, వైసీపీ అంతంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ వేగివాడ క్లస్టర్‌ ఇన్‌ చార్జ్‌ కొనకళ్ళ శివమణి అన్నారు. వేగివాడలో శుక్రవారం సాయంత్రం  ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా  శివమణి మాట్లాడుతూ...  వైసీపీ నాయకులు పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి, దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు. మాదు రవికుమార్‌, చేకూరి భగవాన్‌, కనకళ్ళ ధర్మరాజు, కమ్మిలి సుధాకర్‌, ఆలపాటి బాలకృష్ణ, కొక్కిరిపాటి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa