స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. సోమవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజలు అర్జీలను ఎమ్మెల్యే కిలారి కి అందించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాసిల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ తో పాటు ఎంపీడీవో శేషమాంబ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.