గుత్తి పట్టణంలోని ఎంపీడీఓ కార్యా లయం సమీపంలోని నాలుగు దుకా ణాలలో గుర్తుతెలియని దుండగులు బుధవారం చోటుకి పాల్పడ్డారు. దుకాణాలపై ఉన్న రేకులను తొలగించి ఈ చోరీలకు పాల్పడినట్లు బాధితులు వాపోయారు. ఓ స్పేర్ పార్ట్స్ దుకాణంలో రూ. 20 వేలు అపహరించినట్లు బాధితుడు దూద్ పీరా తెలిపారు. అదేవిధంగా షేక్షా వలి, సాహెబ్, జిలానీ దుకాణాలలో కూడా దుండగులు చోరీలకు పాల్పడి విలువైన వస్తువులు అపహరణ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.