కొంతమంది వాహనాలకన్నా.. వాటి నంబర్‌కే ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. కొన్ని ఫ్యాన్సీ నంబర్లపై క్రేజ్ అలా ఉంటుంది. అలాంటి మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన మహీంద్రా స్కార్పియో కారుకి ఏకంగా రూ.6 లక్షలు వెచ్చించి నంబర్ ప్లేట్ కొనుగోలు చేశారు. మహీంద్రా స్కార్పియో 'RSY 0017' అనే ప్రత్యేకమైన రిజిస్టర్ నంబర్ కోసం ఇంత ఖర్చు చేశాడు.