పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడిన సంఘటన తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోటలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరాములు (35) వివాహం అయి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బి. కొత్తకోట లోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే కదిరి సొంత ఊరు కాగా భార్య పిల్లలతో పొట్టకూటి కోసం వచ్చి ఇక్కడే బెల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం 5 గంటల సమయంలో పాయిజన్ తీసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు బి. కొత్తకోట ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం మదనపల్లి తీసుకుని వెళ్ళమని చెప్పడంతో అంబులెన్స్ లో తీసుకుని వచ్చారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.