మెంతోప్లస్ డబ్బా గొంతులో ఇరుక్కుని ప్రియదర్శిణి అనే 9 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన కర్ణాటక బళ్లారిలోని ఇందిరానగర్ లో జరిగింది. ముత్యాల రాఘవేంద్ర, తులసి దంపతులకు ప్రియదర్శిణి ఏకైక సంతానం. ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మెంతోప్లస్ డబ్బా మింగేయగా, గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించగా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.