ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తరఫు న్యాయవాదికి వివేకా కూతురు సునీత తరఫు న్యాయవాది సాయం చేసేందుకు సీబీఐ కోర్టు శుక్రవారం అనుమతి నిచ్చింది. ఈ మేరకు సునీత వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో సునీత లేదా ఆమె తరఫు న్యాయవాదులు సీబీఐ పీపీలతో కలిసి పని చేయనున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సునీతను సీబీఐ కోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa