సంక్షేమ పథకాల అమలు ద్వారా పేదవానికి ఆర్థిక చేయూత అందించడమే సీఎం జగన్ లక్ష్యమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. నిజాంపట్నం పంచాయతీలో శుక్రవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మలా హరినాథ్ బాబు, జడ్పిటిసి సభ్యులు నర్రా సుబ్బయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు.