ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని మంగళవారం విద్యార్థినిలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ బోడపాడు గ్రామం నుండి ప్రతిరోజు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలకు 40 మంది విద్యార్థినిలు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. బస్సు పాసులు పాఠశాలలో ఇచ్చినప్పటికీ బస్సు ఏర్పాటు చేయకపోవడంతో ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు