కర్ణాటక మైసూరు జిల్లా గుండ్లుపేటె తాలూకాలోని గరగనహళ్లిలో ఉన్న మోరార్జీదేశాయి వసతి పాఠశాలలో కారం ఎక్కువగా ఉన్న ఆహారం తిన్న సుమారు ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం టమాటా బాత్ తిన్న విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, మంటతో బాధ పడ్డారు. వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.