నారా లోకేష్ చేపట్టిన జయహో బీసీ చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైనదని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. ఎన్నికల సమయంలోనే సీఎం జగన్ కి బీసీలు గుర్తుకొస్తారా అని ప్రశ్నించారు. అక్కను వేధించారని ప్రశ్నించిన బీసీ విద్యార్థి అమర్నాథ్ గౌడ్‌ను సజీవదహనం చేశారన్నారు. జై చంద్రబాబు అన్నందుకు తోట చంద్రయ్యను హతమార్చిన దుర్మార్గులు వైసీపీ నేతలు అని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి యాదవులను వేధిస్తున్నారన్నారు. నాలుగేళ్లలో 60 మంది బీసీలను చంపేశారని.. 6 వేలమంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టి హింసించింది నిజం కాదా? అని ఆమె ప్రశ్నించారు.