వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం జగన్ పర్యటించారు. కోనసీమ జిల్లాలోని గురజపులంక, కూనలంకలో పర్యటిస్తున్న సీఎం.. వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి, గతంలో పేపర్లో ఫోటోలు వస్తే చాలని అనుకునేవారు, కానీ ఇప్పుడలా కాదు, వారం రోజులు జిల్లా కలెక్టర్లకు సమయం ఇచ్చాం' అని అన్నారు.