ఒంగోలు నగరంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల స్మశానంలో గ్యాస్ క్రిమటోరియం ను ప్రారంభించాలని, స్మశానాలలో మౌలిక వసతులు కల్పించాలని ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ నాయకులు సోమవారం మేయర్ గంగాడ సుజాతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో గ్యాస్ క్రిమటోరియం ప్రారంభిస్తే నగర ప్రజలకు భారం తగ్గుతుందని, అదేవిధంగా స్మశానాలలో వాచ్మెన్ ను ఏర్పాటు చేయాలని కోరారు.