హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లో ఇ-ఫైల్ సిస్టమ్‌ను ఉత్తమంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించేందుకు సోమవారం జరిగిన పరిపాలనా కార్యదర్శుల సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన.. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. ఈ-ఫైల్ సిస్టమ్ ద్వారా అన్ని ఫైళ్లను ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేసి సమయం ఆదా చేయడంతోపాటు పనులు త్వరితగతిన పరిష్కరించేందుకు దోహదపడాలన్నారు.రెవెన్యూ శాఖ ద్వారా అందజేసే అన్ని ప్రజాసేవలకు ఆన్‌లైన్ విధానాన్ని సమయానుకూలంగా అమలు చేయాలని ఆయన అన్నారు.పరిపాలనలో పారదర్శకతతో పాటు సమర్థత ఉండేలా, పాలనలో సమాచార సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు.