శ్రీ సత్యసాయి హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.