టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిడదవోలు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. పెరవలి జంక్షన్‌లో నిడదవోలు టీడీపీ ఇన్‌చార్జ్ బూరుగుపల్లి శేషారావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మాజీ మంత్రి జవహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం కుట్ర పూరితంగా చంద్రబాబు నాయుని జైల్లో పెట్టాలని అనుకున్నారు పెట్టారని అన్నారు. ఈ కేసులో సాక్షాధారాలు ఉన్నాయా?.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అనే విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు. ఎందుకంటే సాక్షాత్తు ముద్దాయి కాని వ్యక్తి అప్రూరర్‌గా మారారు అని చెబుతున్నారని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa