నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీట్ల కేటాయింపుపై అధ్యయనం చేసేందుకు వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ ఆదేశాలతో వైద్య బృందం బుధవారం పరిశీలన జరిపింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్, చెవి, ముక్కు, గొంతు, రేడియాలజీ విభాగాలకు చెందిన పీజీ సీట్లకు సంబంధించి ఆయా వైద్యుల బృందం పరిశీలన చేపట్టింది. జనరల్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ శ్రీనివాస్‌తోపాటు జనరల్ సర్జరీకి చెందిన డాక్టర్ పురషోత్తం, ఈఎన్‌టీ విభాగానికి చెందిన డాక్టర్ సంపత్‌కుమార్, గైనకాలజీ విభాగం నుంచి డాక్టర్ సంధ్య, ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన డాక్టర్ రాఘవేంద్రసాయి. రేడియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ రాఘవన్ ఈ బృందంలో ఉన్నారు. ఆయా విభాగాలలో ఉన్న వైద్య పరికరాలను పరిశీలించారు. అలాగే విద్యార్థుల బోధనకు అవసరమైన గదులను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జమున, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, పలు శాఖల హెచ్‌వోడీలు పాల్గొన్నారు.