మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగుచూసింది. థానెలోని దోంబివ్లి ప్రాంతంలో 35 ఏళ్ల మనోజ్ అగ్రహారి అనే వ్యక్తి దివ్యాంగురాలైన తన కూతురుని మద్యం మత్తులో గొంతు నులిమి చంపేశాడు. అతడికి నలుగురు ఆడబిడ్డలు ఉన్నారు. వారిలో పదేళ్ల మానసిక వికలాంగురాలు కూడా ఉంది. కాగా ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిని గొంతు నులిమి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.