చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. ఈ రెండు పిటిషన్లలో మొదటగా దేనిపై విచారణ జరగాలనన్న దానిపై ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఉదయం సీఐడీ న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్‌లో సవరణలు చేసి ఇవ్వాలని జడ్జిని ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేయగా తాజాగా వాదనలు ప్రారంభయ్యాయి.