రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్‌లు రోజుకు రెండు ఉండగా భద్రతాపరమైన విషయాలతో వాటిని ఒకటికి కుదించారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు. ఖైదీల రాకపోకలకు చంద్రబాబు ములాఖత్ వల్ల ఇబ్బంది అనడంతో ఐదు వారాలుగా లేని భద్రతా ఇబ్బంది.. ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతూ లీగల్ ములాఖత్‌లను కూడా కుదించడం కుట్రే అంటని టీడీపీ వ్యాఖ్యానించింది. చంద్రబాబు న్యాయ పోరాటంలో జాప్యం జరిగేలా ప్రభుత్వం ఈ తరహా కుట్రలు అంటూ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మండిపడుతున్నారు.