కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి శాసనమండలి మాజీ చైర్మన్ పొలిట్ బ్యూరో, మాజీ ఎమ్మెల్సీ అహ్మద్ షరీఫ్ హాజరై మాట్లాడుతూ. సీఎం జగన్ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని విమర్శించారు. ప్రజలను కులాలు, మతాలు వారీగా విభజించి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.