సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్ ) పంజాబ్ పోలీసులతో సంయుక్త ఆపరేషన్లో అక్టోబరు 30న సరిహద్దు దాటి భారత భూభాగంలోకి మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసేందుకు మరో ప్రయత్నాన్ని చేధించింది. మధ్యాహ్నం సమయంలో, డ్రోన్ ఉనికికి సంబంధించిన నిర్దిష్ట సమాచారంపై, అమృత్సర్లోని నెస్తా గ్రామ శివార్లలో బీఎస్ఎఫ్ మరియు పంజాబ్ పోలీసులు సంయుక్త శోధన ఆపరేషన్ను ప్రారంభించారు.