డోన్ నియోజకవర్గంలో ఓటర్లజాబితాలో చనిపోయిన వారి పేర్లను తొలగించాలని, గ్రామాల్లో లేని వారివి ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేశామని డోన్ నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ధర్మవరం సుబ్బారెడ్డి శనివారం పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న అక్రమాలపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని, అయినా ఓటర్ల జాబితాలో మాత్రం తొలగింపులు చేపట్టడం లేదన్నారు. జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేశామన్నారు.