కొత్త ఓటు నమోదు పై డోర్ టు డోర్ కచ్చితంగా చేయాలని జనసేన పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మునకాల జగన్ కోరారు. మంగళవారం గజపతినగరం తహసిల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీ నేతలతో సమావేశం జరిగింది. గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మార్పులు చేర్పులపై రాజకీయ నేతల సహకారం అవసరమన్నారు. తహసిల్దార్ అరుణకుమారి, ఎన్నికల డి. టి సతీష్ పాల్గొన్నారు.