ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని కమిషనర్ పి బాలాజీ ప్రసాద్ ఆదేశించారు. నెల్లిమర్ల నగరపంచాయతీ కార్యాలయంలో మంగళవారం సచివాలయ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు సచివాలయాలలో 15 నుంచి 60 సంవత్సరాల వయస్సు లోపుగల వారు ఆటలలో పాల్గొడానికి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డులకు వార్డు వాలంటీర్లు ఈకేవైసీ చేయించాలని సూచించారు.