నిత్యం వందలాది మంది ఖాతాదారులు లావాదేవీలు జరిపే పోస్ట్ ఆఫీసును అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులో ఓ భవనం రెండో అంతస్తులో ఏర్పాటు చేయడంతో ప్రజలు అవస్థ పడుతున్నారు. ఇటీవల వరకు ఈ పోస్ట్ ఆఫీస్ అందరికీ అనువుగా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండేది. ఈమధ్యే పోస్ట్ ఆఫీసును వేరే బిల్డింగ్ లోని రెండో అంతస్తులోకి షిఫ్ట్ చేశారు. దీంతో మెట్లు ఎక్కలేక ప్రజలు ప్రత్యేకించి వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు.