మెంటాడ మండలం చల్లపేట పిహెచ్ సి పరిధిలోని కైలాం గ్రామంలో జగనన్న రెండవ విడత ఆరోగ్య సురక్ష కార్యక్రమం, మంగళవారం సర్పంచ్ గండి శ్యామలాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలిని కోరారు. నాయకులు వైస్ సర్పంచ్ భోగిల సత్యం, సీనియర్ నాయకులు గండి సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.