దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న ఓటమి పాలయ్యారు. సొంతవాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నాం.
సాధారణంగా హత్య కేసు 5 రోజుల్లో తేలుతుంది. వివేకా హత్య కేసు దర్యాప్తు మాత్రం 5 ఏళ్లుగా కొనసాగుతోంది. కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే విషయంలో ఏపీ ప్రజల మద్దతు నాకు కావాలి’’అని సునీత కోరారు.