సాధారణంగా ఏదైనా కొత్త రకం జీవిని గుర్తిస్తే వాటికి నామకరణం చేస్తారు. తాజాగా ఒడిశా- పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం జీవిని గుర్తించడం జరిగింది.
ఈ జీవికి రాష్ట్రపతి ద్రౌపతి పేరు పెట్టారు. 'హెడ్ షీల్డ్ సీ స్లగ్' తరహా జీవిగా దీన్ని గుర్తించారు. ఉదయ్ పూర్ డిఘా తీరంలో శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ జీవికి 'మెలనోక్లమిస్ ద్రౌపది' అని నామకరణం చేశారు.