ప్రధాని మోడీకి డార్జిలింగ్ బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా రక్తంతో శనివారం లేఖ రాశారు. గూర్ఖాల సమస్యలకు పరిష్కారం చూపుతానని ఏప్రిల్ 10, 2014న సిలిగురిలో ఇచ్చిన హామీని మోడీ నెరవేర్చలేదన్నారు.
గూర్ఖాలలో 11 సామాజిక వర్గాలకు ST హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. గూర్ఖాలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత రాజకీయ పరిష్కారం చూపాలన్నారు. ప్రధాని మోడీ తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.