పంజాబ్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) ఈసారి ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.
పంజాబ్ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ 13 లోక్సభ స్థానాలకు గాను 8 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించింది. అదే సమయంలో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందంటూ వచ్చిన ఊహాగానాలను ఖండించారు.