ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిలకలూరిపేటలో నిబద్ధతగల కార్యకర్త పోటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 01:54 PM

గుంటూరుకు చెందిన కావటి మనోహర్‌నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన కుటుంబం నుంచి వచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీలో సాధారణ కార్యకర్త­గా ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటాలు చేస్తుండటాన్ని పసిగట్టిన సీఎం వైయ‌స్ జగన్‌.. మున్సిపల్‌ ఎన్నికల్లో గుంటూరు కార్పొరేషన్‌లో కా­ర్పొరేటర్‌ టికెట్‌ ఇచ్చారు. అత్యధిక మెజార్టీతో కా­ర్పొరేటర్‌గా ఎన్నికైన మనోహర్‌ నాయుడు నిబద్ధత, అంకిత భావం చూసి ఆయన్ను గుంటూ­రు మేయర్‌గా చేశారు. మేయర్‌గా రాణిస్తూ అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటుండటంతో చిలకలూరిపేట నియోజకవర్గం అభ్యర్థిగా అవకాశమిచ్చారు. ఈ స్థానం నుంచి 2014–19 మధ్య మంత్రిగా పనిచేసిన పత్తిపాటి పుల్లారావును టీడీపీ అభ్యర్థిగా టీడీపీ బరిలోకి దించడం గమనార్హం.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com