ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర విభజన చేసిన ద్రోహులతో ప్రజలు జతకట్టాలా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 09:50 AM

నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన ద్రోహులతో ప్రజలు జతకట్టాలా? అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. రాజకీయంగా వైయ‌స్ఆర్‌  కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలోని అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి అదే కాంగ్రెస్‌, అదే టీడీపీతో కలిసిపోయి వైయ‌స్ఆర్‌ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్ర జరుగుతోంద‌న్నారు. వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి నాకన్న 13 ఏళ్లు చిన్నవాడు . ఈయన భవిష్యత్తును నాశనం చేయడానికి ఈనాడు, చంద్రబాబు, ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు వేస్తున్నారు. వీళ్లంతా మనుషులేనా? అని ప్ర‌శ్నించారు. అవినాష్‌ ఎలాంటి వాడో నాకు, మీ అందరికి తెలుసు. గొప్ప మెజార్టీతో గెలిపించాలని సీఎం వైయస్ జ‌గ‌న్ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa