ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో మంగళవారం కంభం సర్కిల్ సిఐ రామకోటయ్య, బేస్తవారిపేట ఎస్ఐ నరసింహారావు ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకే ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించమని సిఐ రామకోటయ్య తెలిపారు.