ఏలూరు వైఎస్ఆర్ కాలనిలో కార్డెన్ సెర్చ్ ను అదనపు ఎస్పీ అడ్మిన్ జి. స్వరూపారాణి ఏలూరు డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానస్పద వ్యక్తులను గుర్తించి ఏ విధమైన ధ్రువ పత్రాలు లేని టూ వీలర్స్ వాహనాలు70 , 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు