ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని కర్నూలు డీఈఓ సామూయేలు తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. పది పరీక్షలకు మెత్తం 930 మంది హాజరవుతున్నారని తెలిపారు. అదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండలో 5 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఇంటర్ పరీక్షలకు 1265 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 10 నుంచి 12వ తేది వరకు జరుగుతున్నట్లు ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa