చిత్తూరు నగరంలో నీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని క్లోరినేషన్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని నగర కమిషనర్అరుణ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.వర్షాకాలం నేపథ్యంలో నీటి లీకేజీలు నివారణ,నీరుకలుషితం కాకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా క్లోరిన్ పరీక్షలను కమిషనర్ తనిఖీ చేశారు.బుధవారం నీటికి ఆర్సీ (రెసిడ్యుయల్ క్లోరిన్)- పరీక్షలను తనిఖీ చేసి క్లోరిన్ శాతాన్ని స్వయంగా పరీక్షించారు.