నేడు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు అంశాలను వివరించామని అచ్చెన్నాయుడు తెలిపారు. శాసన సభా పక్ష నేతగా చంద్రబాబును మూడు పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఆ వివరాలను గవర్నర్‌ను కలిసి అందజేశామని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించాలని కోరామన్నారు. సాయంత్రం గవర్నర్ కార్యాలయం నుంచి రాజ్యంగపరంగా పిలుపు వస్తుందన్నారు. బుధవారం నాడు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa