రాజకీయ కోణాల్లో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గౌతమిశాలి పేర్కొన్నారు. గురువారం ఆమె ఉరవకొండ గ్రామీణ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసి పలు దస్త్రాలను పరిశీలించారు. అల్లర్లకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట గుంతకల్లు డీఎస్పీ శివభాస్కరరెడ్డి, ఉరవకొండ అర్బన్ సీఐ సురేశ్ బాబు, ఎస్ఐ రాఘవేంద్రప్ప ఉన్నారు.