వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా తెనాలి 13వ వార్డులో రూ.20 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా నాడు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాన్ని తాజాగా టీడీపీ కార్యకర్తలు పగులకొట్టారు. అలాగే ఐదో వార్డులో కౌన్సిలర్ తోట రఘురామ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.