ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చవటపాలెంలో గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని నడిరోడ్డులో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ విగ్రహాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారు. పెద్ద బండరాయితో తొలుత మెడ భాగంలో పగలగొట్టి తల భాగం తీసేయాలని ప్రయత్నించారు. అయితే వీలుకాకపోవడంతో ఎడమ చేతిని బండరాయితో బలంగా కొట్టడంతో ఆ భాగం పూర్తిగా విరిగిపోయింది. వైయస్ఆర్సీపీ శ్రేణుల ఫిర్యాదు మేరకు నాగులుప్పలపాడు ఎస్సై బ్రహ్మనాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.