భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు. ఆదివారం అనంతపురం నగరంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం సమీపంలోని ఆంజినేయస్వామి ఆలయం వద్ద ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకర్, జిల్లా అధ్యక్షుడు ప్రభుకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మందల శాంతకుమార్ పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు అశోక్‌రెడ్డి, సూర్యప్రకాష్, ఇలియాజ్, రాజశేఖర్, శివతేజ పాల్గొన్నారు.