ఆమదాలవలస మండలంలోని చేపేనపేట, నిమ్మతొర్లువాడల్లో ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో సాగుచేస్తున్న చెరకు నుంచి తయారు చేసిన బెల్లాన్ని ప్రకృతి వ్యవసాయవిభాగం డీపీఎం రేవతి సమక్షంలో తిరుమల తిరుపతి దేవ స్థానానికి(టీటీడీ) పంపించారు. ఈసందర్భంగా రేవతి మాట్లాడుతూ.... చేపేపేట, నిమ్మతొర్లోడ నుంచి పది టన్నుల బెల్లాన్ని తిరుపతి దేవస్థానానికి పంపించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెఫెడ్ సిబ్బంది, ఎన్ఎఫ్ఏ శ్రీనివాస్, మార్కె టింగ్ ఎన్ఎఫ్ఏ శివాజీ, మాస్టార్ ట్రైనర్ శోభన్, యూనిట్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చిరంజీవి, తిరుపతిరావు, లక్ష్మీకృష్ణవేణి, జానకిరామ్, గ్రామ సర్పంచ్‌లు సత్యరాజ్, ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.