నరసన్నపేట మేజర్ పంచాయతీలోని ఒకటోవ సచివాలయాన్ని తహశీల్దార్ టి. సత్యనారాయణ ఆకస్మికంగా పరిశీలించారు. బుధవారం సచివాలయానికి వెళ్లిన ఆయన స్థానిక కార్యనిర్వాహణ అధికారి ఎస్. చిన్నారావుకు పరిపాలన అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సంబంధించిన దరఖాస్తులను వెంటనే అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఆక్రమణలపై దృష్టి సారించాలని సూచించారు.