వరద ఉధృతికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటును ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. కొత్త గేటు ఏర్పాటుపై ఇంజినీరింగ్ నిపుణులతో చర్చించారు. ప్రతి నీటి చుక్కను ఆదా చేసే ప్రయత్నం చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రులు తెలిపారు. అనంతపురం, కర్నూలు జిల్లాల రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.