సోమవారం ఉదయం ఫాక్స్ కాన్ ప్రతినిధులతో భేటీ అయిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరించారు. ప్లాంట్ కాదు.. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయాలని కోరిన లోకేష్ . ఫాక్స్ కాన్ మెగా సిటీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం తాము అందిస్తామని లోకేష్ హామీ. ఈ రోజు జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్ కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే తమ బృందం పర్యటించి పూర్తిస్థాయి ప్రణాళికతో మీ ముందుకు వస్తుందని కంపెనీ ప్రతినిధులు లోకేష్ కు వివరించారు.