గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పటినుండో తిష్ట వేసి ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వంలో అడుగులు వేస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గళ్లా మాధవి తెలిపారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజలు పార్టీ నేతలు నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ రకాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ప్రధానంగా గుంటూరు ఉద్యోగ నగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ సభ్యులు తమ కాలనీలో పార్క్ అభివృద్ధి చేయాలని రోడ్లు మరియు డ్రెయిన్లు నిర్మించాలని కోరారు అదేవిధంగా వి - కన్వెన్షన్ వెనుక గంజాయి బ్యాచి రెచ్చిపోతున్నారని పెట్రోలింగ్ పెంచి తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవిని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ గతంలో తాను డివిజన్ పర్యటనకు వచ్చినప్పుడు పార్కును పరిశీలించాలని, రోడ్లు మరియు డ్రెయిన్లు, స్ట్రీట్ లైట్ లు తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీనిచ్చారు.