ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిహారం ఇవ్వకుంటే ధర్నా చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2024, 04:34 PM

అచ్యుతాపురం ఘటనలో బాధిత కుటుంబాల‌కు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే బాధితుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతుంద‌ని, స్వయంగా నేనే ధర్నాకు వస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో  మాట్లాడుతూ..... అచ్యుతాపురం ఘటన బాధాకరం. ఈ ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదు. ఘటన జరిగింది రాత్రి కాదు పట్టపగలు. అయినా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. హోం మంత్రి పర్యవేక్షణకు వెళుతున్నాను అన్న మాటే లేదు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారు. ఎంత మంది చనిపోయారో తెలియదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకూడదన్న తాపత్రయం కనిపించింది. కలెక్టర్ కమిషనర్ ఎప్పుడు వెళ్లారనేది చాలా బాధ కలిగించే విషయం. ఘటనా స్థలానికి ఆంబులెన్సులు కూడా రాని పరిస్థితి. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనే మా హయాంలో జరిగింది. అదీ కోవిడ్‌ సమయంలో. ఎల్జీ పాలీమర్స్‌ ఘటనలో 24 గంటల్లోపే పరిహారం ఇప్పించాం. కోటి రూపాయల పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదే. అప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే పాలక, ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన కాసేపటికే కలెక్టర్‌ ఘటనా స్థలానికి వెళ్లారు. నేనే ఉదయం 11 గంటలకు ప్రమాద స్థలానికి వెళ్లాను. గంట్లలోనే రూ.30 కోట్లు పరిహారం సొమ్ము పంపించాం. గతంలో ఏ ప్రభుత్వం మా ప్రభుత్వంలా స్పందించలేదు. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు బాధగా అనిపిస్తోంది. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa